Tuesday, March 4, 2025

బుద్ధనగర్‌లో గృహిణి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన సంఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బుద్ధనగర్‌కు చెందిన జోత్యి(30), కృష్ణ భార్యభర్తలు. ఇద్దరి మధ్య కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. దీంతో కృష్ణ రోజు భార్య జ్యోతిని కొట్టేవాడు. ఈ క్రమంలోనే జ్యోతి మృతిచెందింది. దీనిపై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, కృష్ణ తమ కూతురిని నిత్యం వేధింపులకు గురిచేసేవాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానస్పదస్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News