Monday, January 20, 2025

ఆర్థిక ఇబ్బందులతో వివాహిత మృతి

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వివాహిత ఉరి వేసుకొని మృతిచెందిన సంఘటన గు రువారం సంగెం మండలంలో చోటు చేసుకుంది. కు టుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం మండలం నార్లవాయి గ్రామానికి చెందిన మొలుగూరి నాగమణి(23) ఆర్థిక ఇబ్బందులతో కుటుంబానిన పోషించలేక, భర్త ఏ మి పనిచేయకపోవడంతో పాటు మద్యానికి అలవాటు పడటంతో నాగమణి జీవితంపై విరక్తి చెంది గురువారం ఇంటిలోని ఇనుప పైపుకు చున్నీతో ఉరి వే సుకొని మృతిచెందింది. మృతురాలికి నాలుగేళ్ల కుమారుడు లోకేష్, రెండేళ్ల కూతురు స్నేహ ఉన్నారు. కాగా మృతురాలి తల్లి జాని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై భరత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News