Tuesday, January 21, 2025

వ్యవసాయ బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అక్కల్‌చెడ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై తోట మహేందర్ కథనం ప్రకారం.. మండలంలోని అక్కల్‌చెడ గ్రామానికి చెందిన ఇస్లావత్ త్రిష(23) శనివారం సాయంత్రం ఇంటిలో భర్త తిరుపతితో గొడవ జరుగగా భర్త తిరుపతి కోపంలో నువ్వు సత్తే చావు అని అనడంతో మనస్తాపానికి గురైన త్రిష ఆదివారం ఉదయం తన ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

వెంటనే చుట్టు పక్కల వారు వచ్చి బావిలోకి దూకి బయటకు తీసే లోపే త్రిష మృతి చెందింది. మృతురాలికి భర్త తిరుపతి, 10 నెలల కూతురు ఉంది. మృతురాలి తండ్రి లావణ్య భద్రు ప్రియాతి మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట మహేందర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News