Thursday, December 26, 2024

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

దండేపల్లిః మండలంలోని కర్నపేట గ్రామానికి చెందిన ఆజ్మీర మౌనిక(౩౦)కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సాంబమూర్తి తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. లింగాపూర్ గ్రామానికి చెందిన మౌనికకు కర్నపేటకు చెందిన ఆజ్మీర భూమేష్‌తో 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కడుపు నొప్పి అధికం కావడంతో ఫిబ్రవరి 14న పురుగుల మందు సేవించగా, చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News