Monday, February 3, 2025

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు భరించలేక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం భువనగిరి- యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన బోరెడ్డి రాజశేఖర్ రెడ్డి గుండాల మండలం పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన మలిపెద్ది రవళి (25)ని 2019 మే 23వ తేదీన వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందు 20 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు, ఇతర విలువైన వస్తువులు కట్నం కింద పుట్టింటి నుంచి తీసుకున్న అల్లుడు రాజశేఖర్ రెడ్డి కొద్ది రోజులు భార్య రవలిని మంచిగానే చూసుకున్నాడు. తర్వాత ఇద్దరు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. బతుకుతెరువు కోసం హైదరాబాద్ శివారు పటాన్ చెరువు, ఉప్పల్ లో ఆ తదుపరి చిలకా నగర్ లో నివాసం ఉంటూ ఇద్దరు ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవినం కొనసాగించారు. వీరికి సాత్విక (5), పునర్విక (3) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అదనపు కట్నం అనగా పుట్టింటి ఊరిలో ఉన్న ఆమె తల్లిదండ్రుల వద్ద వ్యవసాయ పొలం కోసం భర్త, అత్త, మామ, ఆడిబిడ్డ వేధింపులు రవళికి ఎక్కువయ్యాయి. సంవత్సరం క్రితం చిలకానగర్ లోనే భార్య ఇద్దరు పిల్లలను వదిలేసి రాజశేఖర్ రెడ్డి వెళ్ళిపోయాడు. కనీసం పిల్లలకు ఆధార్ కార్డు లేని పరిస్థితి. బిటెక్ చదివిన రవళి స్థానిక ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. భర్త వదిలేసి వెళ్లిపోవడం పిల్లలకు ఆధార్ కార్డు లేని కారణంగా స్కూల్ లో పిల్లలకు అడ్మిషన్ లభించక మానసిక ఆందోళనతో రవళి జీవిస్తోంది. సంవత్సరం క్రితం వెళ్లిపోయిన భర్త రెండు రోజుల క్రితం నగరంలోని ఓ ఫంక్షన్ కి వచ్చాడు. అదే రోజు భార్య రవళి వద్దకు రాజశేఖర్ రెడ్డి తల్లిదండ్రులతో వచ్చి వెళ్లాడు. ఆరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రవళి పురుగుల మందు తాగింది. అపస్మానిక స్థితికి చేరుకున్న ఆమెను ఇరుగుపొరుగువారు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.

భర్త, అత్త, మామ ఫంక్షన్ కి వచ్చి వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలు రవళి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. రవళి డెడ్ బాడీ ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీలో ఉండగా డెడ్ బాడీని చూడటానికి భర్త, అత్త, మామ, ఆడిబిడ్డ లు రాలేదు అంటే ఆత్మహత్యకు ప్రేరేపిచ్చినట్లు రుజువుతుందని తెలిపారు. రవళి ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్త మామ, ఆడబిడ్డల పై చర్యలు చేపట్టాలని మృతురాలి తల్లిదండ్రులు బంధువులతో కలిసి పిఎస్ ఎదుట ఆందోళన చేశారు. మృతురాలు తల్లి రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇణ్‌స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News