Friday, January 10, 2025

ఒడిశాకు చెందిన వివాహిత లక్షన్నర రూపాయలకు రాజస్థాన్ లో అమ్మివేత

- Advertisement -
- Advertisement -

Odisha woman sold

జైపూర్: రాజస్థాన్‌లో రూ. 1.5 లక్షలకు అమ్ముడుపోయిన వివాహితను,  పశ్చిమ ఒడిశా జిల్లా ఝార్సుగూడా పోలీసులు రక్షించారు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా రాంపూర్ గ్రామం నుంచి మహిళను రక్షించినట్లు ఝార్సుగూడ ఎస్పీ బికాస్ చంద్ర దాస్ తెలిపారు. “ఏప్రిల్ 7న, వివాహితను ఝార్సుగూడ నుండి  రాజస్థాన్‌కు అక్రమ రవాణా చేసినట్లు మాకు ఫిర్యాదు అందింది. ఆ తర్వాత తనకు ఇష్టం లేకుండానే మనోజ్ ప్రజాపతి అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది’ అని దాస్ తెలిపారు.

ఝార్సుగూడా జిల్లాలో సుప్రియా ప్రజాపతి అనే మహిళ తనతో పాటు రాజస్థాన్ కు రావాలని మభ్యపెట్టడంతో బాధిత మహిళ తన భర్తతో గొడవ పడింది. ఏప్రిల్ 7న ఝార్సుగూడకు చెందిన హృషికేష్ సేథీ, కిరణ్ సేథీ, డానీషి అనే ముగ్గురిని అరెస్టు చేయడంతో ఈ అక్రమ రవాణా గురించి పోలీసులకు తెలిసింది. ఏప్రిల్ 13న సుప్రియ అలియాస్ రజనీ, మనోజ్ ప్రజాపతిని అరెస్టు చేశారు. ‘‘నేను ఆ మహిళను పెళ్లి చేసుకుని రూ. 1.5 లక్షలు చెల్లించాను. ఆమెకు అప్పటికే పెళ్లయిందని, ఒక బిడ్డ ఉందని నాకు తెలియదు” అని మనోజ్ ప్రజాపతి వాపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News