- Advertisement -
సిటిబ్యూరోః ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…గ్రామానికి చెందిన భవానీ, మహేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు రోజుల క్రితం భార్యభర్తకు గొడవ జరిగింది. ఈ క్రమంలోనే భవానీ తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య, పిల్లల కోసం మహేష్ బంధువులు, చుట్టుపక్కల వెతికినా ఆచూకీలభ్యం కాలేదు. దీంతో మహేష్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -