Monday, December 23, 2024

శాస్త్రీపురంలో ఉరివేసుకుని వివాహిత మృతి

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : ఓ వివాహిత అనుమానస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు,మృతురాలి బంధువల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శాస్త్రీపురంలో నివాసం ఉండే ఫాతిమా భర్త, అత్తింటి వాళ్లు పెట్టె బాదలు తాళలేక ఇంట్లోని తన గదిలో ఉరివేసుకుంది. గదిలోకి వెల్లిన ఫాతిమా ఎంతకీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు తట్టారు. అయినా ఉలుకు , పలుకు రాలేదు. దాంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇంటోని ఫ్యానుకు ఆమె ఉరివేసుకుని కనిపించింది. దాంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది.

అప్పటికే ఫాతిమా మృతి చెందిన వైద్యులు దృవీకరించారు. దీంతో మృతురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను భర్తతో పాటు అత్తింటి వారు నిత్యం ఇబ్బంది పెడుతూ చివరకు ప్రాణాలు బలితీసుకున్నానని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఫాతిమా మృతికి కారణమైన వారి పై చట్టపరంగా కేసులు నమోదు చేసి శిక్షించాలని వారు పోలీసులకు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News