Monday, January 20, 2025

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః జీవితంపై విరక్తి చెందిన ఓ వివాహిత ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘట ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికు కథనం ప్రకారం… రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, చింతపట్ల గ్రామానికి చెందిన ధనంజయ, స్వాతి (33) ఇద్దరు కుమారులతో కలిసి హస్తినాపురం షిర్డీ సాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. ధనంజయ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బుధవారం ఉదయం ధనుంజయ, స్వాతి అల్పాహారం చేశారు. తర్వాత ఆమె భర్తకు లంచ్ బాక్స్ పెట్టి పంపింది, కుమారులు పాఠశాలకు వెళ్లారు. అందరూ వెళ్లిన తర్వాత ఇంటి తలుపులకు గొల్లం వేసి పడక గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఆమె ఉరి వేసుకుంది. సాయంత్రం ధనుంజయ స్వాతికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించక పోవడంతో ఇంటికి వచ్చాడు.

తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి ముఖ ద్వారం పైన ఉన్న గ్లాసులను పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా స్వాతి పడక గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే అతడు స్వాతి తండ్రి బిక్షపతికి, పోలీసులకు సమాచారం అందించాడు. మృతురాలి తండ్రి బిక్షపతి రాత్రి 9.45 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు చనిపోయే ముందు తాను ఉన్నత చదువుల కోసం ఎంతో కష్టపడుతున్నానని, అయినా నాకు శరీరం సహకరించకపోవడంతో పాటు కళ్లు సక్రమంగా కనిపించపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు ఎవరు కారకులు కారని సూసైడ్ నోట్ రాసి ఆత్మ హత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News