Monday, December 23, 2024

విదేశాల్లో భర్త మృతి: హైదరబాద్ లో భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అంబర్ పేట: విదేశాల్లో భర్త గుండెపోటుతో మృతి చెందడంతో అంబర్ పేటలో నివాసముంటున్న భార్య తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారము అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం… వనస్థలిపురం చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మనోజ్ తో ఒకటిన్నర సంవత్సరాల కిందట అంబర్ పేట డిడి కాలనీ చెందిన సాహితి కి(29) పెద్దల సమక్షంలో ఘనంగా వివాహము జరిగింది. పెళ్లి అయిన కొద్ది రోజులకు అమెరికాలోని డల్లాస్ ఫారిస్కో లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ భార్యా భర్తలు నివాసం ఉంటున్నారు. ఈనెల 2న సాహితీ నగరంలోని అంబర్ పేట డిడి కాలనీలో నివాసం ఉంటున్న తమ తల్లిదండ్రులను చూడడానికి వచ్చింది.

ఈనెల 20వ తేదీన సాహితి భర్త మనోజ్ కు అమెరికాలో హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో మృతి చెందాడు. ఈ వార్త విన్న భార్య సాహితి ఒక్కసారిగా కుప్పకూలింది. అతని మృతదేహాన్ని ఈనెల 23న ఇండియాకు తీసుకువచ్చారు. ఈనెల 24న వనస్థలిపురంలో అంత్యక్రియలు జరిగాయి. అనంతరం సాహితి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన తల్లిదండ్రులతో కలిసి అంబర్ పేట డిడి కాలనీలో తమ ఇంటికి వచ్చింది. సాహిత్య రాత్రి తన చెల్లెలి సౌజన్యతో కలిసి ఒకే రూమ్ లో పడుకున్నారు. గురువారం ఉదయం 9:20 గంటల సమయంలో సౌజన్య వాష్ రూమ్ కి వెళ్లింది. సౌజన్య  పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చే లోపే తీవ్ర మనస్థాపానికి గురైన సాహితి రూమ్ లోపల నుండి గడి వేసుకొని చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది .కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని అంబర్ పేట పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News