Friday, December 27, 2024

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

వరకట్న వేధింపులతో గృహిణి అత్మహత్యకు గురైన సంఘటణ హయత్‌నగర్ పోలీస్‌స్టెషన్ ఫరిధీలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగోండ జిల్లా దేవరకొండ చింతపల్లి మండలం గషిరామ్ తండ దేనియా తండకు చెందిన రమావత్ శివకు 18 నెలల క్రితం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిధ్దకు చెందిన విస్లావత్ లాలు కుమార్తె సుజాత అలియాస్ దివ్య (21) ను శివకు వివాహం జరిగింది.

వీరికి 6 నెలల పాప సంతానం. గత కొన్ని నెలలుగా హయత్‌నగర్ బంజారా కాలనీలో శివ ఆటో నడుపుకుంటూ భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇదీలా ఉండగా గత కొన్ని నెలలుగా కట్నం తీసుకరావాలని సుజాతను శివ మరియు వారి కుటుంబ సభ్యులు అత్త, మరిది,ఆడబిడ్డ నిత్యం వేధిస్తున్నట్లు తెలిపారు. మనస్థాపానికి గురైన సుజాత మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని చనిపొయినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

తమకు న్యాయం చేయాలని సుజాత తండ్రి లాలు అవేదన
తమ కూతురు సుజాతను భర్త శివ వారి కుటుంబ సభ్యులు కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రకరించారంటు తమకు న్యాయం చేయాలని సుజాత కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున జాతీయ రహాదారీపై బైటాయించి ఆందోళన చేపట్టారు. మృతదేహన్ని తమకు చూపెట్టకుండ పోస్టుమార్టంకు తరళించడం ఎమిటని ప్రశ్నించారు. సుజాత మృతి చెందిన ఇంట్లోకి వెళ్లనివ్వకుండ పోలీసులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దీంతో ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ నిందితుల వద్ద మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తానని హమీ ఇవ్వడంతో ధర్నను విరమింప చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News