Thursday, January 23, 2025

కడుపు నొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కొందుర్గు : కడుపు నొప్పి భరించలేక ఓ వివాహిత మహిళ ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొందుర్గు మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం … కొందుర్గు మండల కేంద్రానికి చెందిన పిచ్చకుంట్ల కుమార్ అనే వ్యక్తికి జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలోని రావిర్యాల గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల అమృతను 14 సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం చేశారు. అప్పటినుంచి వీరి సంసార జీవితంలో ఎటువంటి గొడవలు పంచాయితి లేకుండా అన్యోన్యంగా ఉన్నారని వారు తెలిపారు.

3 సంవత్సారాల నుంచి అమృతకు అప్పుడప్పుడు త్రీవమైన కడుపు నొప్పి వచ్చేదని పలుమార్లు పలు ఆసుపత్రులకు చూయించిన ఇంత వరకు నయం కాలేదని వారు తెలిపారు. శనివారం కూడ తెల్లవారుజామున 3.30 గంటలకు కూడ మళ్లి కడుపు నొప్పి రావడంతో కడుపు నొప్పి భరించలేక భర్త బహిర్భూమికి వెళ్లిన తర్వాత ఇంట్లోని పై కప్పుకు చీరతో ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడంతో భర్త కుమార్ వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుప్రతికి తరళించగా అప్పటికే మరణించిందని డాక్టర్లు తెలిపారు.మృతురాలికి తల్లి పిచ్చకుంట్ల సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు జరుపుతున్నాట్లు ఎస్సై జె.క్రిష్ణయ్య తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News