Wednesday, January 22, 2025

పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పిల్లలు పుట్టడం లేదని మనస్థాపంతో వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం శిర్సనగండ్లలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. శిర్సనగండ్ల చెందిన రాజశ్రీ(29) కి ఎపిలోని కృష్ణా జిల్లా కంభంపాడు గ్రామానికి చెందిన శేషుకుమారుతో 2014 లో వివాహం జరిగింది. పెళ్లై పది సంవత్సరాలైన పిల్లలు పుట్టకపోవడంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు అక్ష్్యేవి. ఈ క్రమంలో రాజశ్రీ మూడు నెలల క్రితం భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News