Wednesday, January 22, 2025

ఉరి వేసుకొని వివాహిత అత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెజ్జూరుః బెజ్జూరు మండలంలోని రెబ్బెన కొత్తగూడ గ్రామంలో ప్రియంక దేవనాథ్ (28) ఉరి వేసుకోని శుక్రవారం రాత్రి అత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం ప్రియంక దేవనాథ్ భర్త తుషార్ దేవనాథ్ కొన్ని సంవత్సరాలుగా కొత్తగూడ గ్రామంలో ఉపాధి కోసం వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు. గత 10 నెలల క్రితం తుషార్ దేవనాథ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇట్టి విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని అసుపత్రిలొో చికిత్స నిర్వహిస్తున్న క్రమంలోనే అతను కోమలోకి వెళ్లిపోయాడు. అతన్ని వైద్యం కోసం అతని భార్య ప్రియంక దేవనాథ్ 9 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించినప్పటికి అతని అరోగ్యం కుదుటపడలేదు. తెచ్చిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి లోనై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

అమెకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇద్దరు అడపిల్లలు వారి స్వగ్రామం అయిన కాగజ్‌నగర్ మండలంలోని ఈజ్‌గాం విలేజ్ నెంబర్ 4లో నివాసం ఉంటారు. కానీ అమె పెద్ద కుతురు ఒకరు మాత్రమే ఆమె వద్ద ఉండడంతో తెల్లవారు జామున తల్లి ఉరి వేసుకున్న విషయాన్ని గమనించి రోధించి కేకలు పెట్టడంతో ఇరుగు పొరుగు ప్రజలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకోని పరిశీలించగా ఇంట్లో ఉరి వేసుకొని కనిపించింది. దీంతో వెంటనే గ్రామ ప్రజలు వారి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ వెంకటేష్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్ సామాజీక అసుపత్రికి తరళించారు. అక్కడికి కౌటాల సిఐ సిద్దిక్‌పాషా చేరుకోని విచారణ చేపట్టారు. అమె తండ్రి తారక్ మండల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News