Thursday, January 23, 2025

వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మెదక్: మెదక్ పట్టణం ఫతేనగర్‌కు చెందిన వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… పట్టణానికి చెందిన శ్రీపతి శోభ(23) భర్త శ్రీకాంత్ శనివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో బెడ్‌రూంలోని సీలింగ్ ప్యాన్‌కు చీరతో ఉరివేసుకుని చనిపోయింది. గతంలో తన మొదటి భర్త చనిపోవడంతో మృతురాలిపై ఘనపూర్ పోలీస్ స్టేసన్‌లో కేసు నమోదైంది.

కేసు విషయంలో కోర్టుకు తిరుగుతుంది. గత కొన్ని నెలలుగా తీవ్ర మానసీక ఆందోళన చెందుతూ ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. మృతురాలికి ఒక కొడుకు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి, తండ్రి స్వరూప,నర్సింలుల ఫిర్యాదు మేరకు పట్టణ సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News