Sunday, January 19, 2025

పుప్పాలగూడలో వివాహిత మిస్సింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ వివాహిత మిస్సింగ్ నగరంలో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం…నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో ఉంటున్న బాలకృష్ణ, కృష్ణప్రియకు రెండేళ్ల క్రితం వివాహమైంది. బాలకృష్ణ ఉదయం ఆఫీస్‌కు వెళ్లిపోయాడు, మధ్యాహ్నం సమయంలో భార్య కృష్ణప్రియకు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడ్డ బాలకృష్ణ ఇంటికి వచ్చి చూశాడు. ఇంట్లో కృష్ణప్రియ లేకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు,తెలిసిన వారు, బంధువులకు ఫోన్ చేశాడు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News