Sunday, December 22, 2024

ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యం

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ : శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద గోల్కొండ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక శంషాబాద్ రూరల్ ఇన్స్‌పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం … భర్త బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద గోల్కొండ గ్రామానికి చెందిన నెల్లి బాలరాజు తండ్రి నెల్లి మల్లప్ప వృత్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బాలరాజు భార్య నెల్లి అమృత (23) భార్య అమృత గత 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు నాకు జ్వరం వచ్చింది శంషాబాద్ లోని శ్రీనివాస్ హాస్పటల్ లో చూయించుకొని వస్తానని కుమారుడు శివ కుమార్‌తో కలిసి వెళ్లింది. అదే రోజు సాయంత్రం వరకు ఎదురుచూసిన భర్త బాలరాజు ఎంతకు తిరిగి ఇంటికి రాకపోవడంతో వెంటనే ఆస్పటల్ వద్దకు వెళ్లి విచారించగా తన భార్య హాస్పిటల్ కి

రాలేదని హాస్పటల్ సిబ్బంది తెలిపారని వెంటనే చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లబించకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య వెళ్లేముందు నల్ల రంగు చీర ధరించి ఉందని అయితే తెల్లవారుజామున 1:30 గంటలకు గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి తన కుమారుడు శివప్రసాద్‌ను ఇంటి సమీపంలో దింపి వెళ్లారని తల్లి సమాచారం ఇవ్వగా వెంటనే తన కుమారుడు శివప్రసాద్ ని విచారించగా భయంతో ఏమి చెప్పడం లేదని, ఈ సంఘటనపై చికెన్ షాప్ నడిపిస్తున్న మహేష్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని వెంటనే తగు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేసి భార్య అమృతను తమకు అప్పగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News