Sunday, January 19, 2025

పుప్పాలగూడలో వివాహిత అదృశ్యం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పుప్పాల గూడలో వివాహిత మిస్సింగ్ కలకలం రేపుతోంది. కృష్ణ ప్రియ అనే మహిళ భర్తకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఉదయం ఉద్యోగం నిమిత్తం భర్త బాలకృష్ణ బయటకు వెళ్లిపోయాడు. భార్యతో మాట్లేడేందుకు మధ్యాహ్నం ఫోన్ చేశాడు.. ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో కంగారు పడ్డ భర్త ఇంటికి వచ్చి చూశాడు. భార్య కనిపించకపోవడంతో ఆచూకీ కోసం చుట్టూ పక్కల వెతికాడు.

ఎక్కడా భార్య జాడ దొరకకపోవడంతో బాధితుడు బాలకృష్ణ నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. బాలకృష్ణ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం బాలకృష్ణకు కృష్ణ ప్రియకు వివాహం జరిగిందని బాధితుడు పోలీసులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కృష్ణప్రియ కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News