Thursday, January 23, 2025

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెదక్ పట్టణ పరిధిలోని జమ్మికుంటకు చెందిన ఇప్ప నవీన (22) కుటుంబ కలహాలు భరించలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలోని జమ్మికుంట వీధికి చెందిన్ నవీన్‌కుమార్‌కు పాతూరుకు చెందిన నవీన (22)తో 2022లో వివాహం జరిగింది. కాగా బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. భర్త తాగుడుకు బానిస కావడంతో తరచూ ఇరువురి మధ్య గొడవలు జరిగేవని బంధువులు తెలిపారు.  పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు పంచాయతీ పెట్టి నచ్చజెప్పినా భర్త తాగుడు మానకపోవడంతో ప్రతి రోజు ఇంటికి తాగి వచ్చి గొడవ పడేవాడన్నారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన నవీన ఆత్మహత్య చేసుకుందన్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు  దర్యా ప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News