Thursday, January 23, 2025

వివాహిత ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

మల్హర్ : భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం కొయ్యూరు పంచాయతీ పరిధిలోని పివినగర్ గ్రామంలో గుంటి శిరీష(21) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గత నాలుగు రోజులుగా శిరీష ఇంటి నుండి వెళ్లిపోయి కనబడుట లేదని, దీంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతుకులాడగా కొయ్యూరు నాగులమ్మ దేవాలయం ఎదుట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు గమనించారు.

దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి సిఐ రంజిత్‌రావు, తహసిల్దార్ శ్రీనివాస్, ఎస్సై నరేష్‌లు పంచనామా నిర్వహించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శిరీషకు భర్త కుమార్తె కలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News