Monday, December 23, 2024

భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన భర్త..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ్యసనాలకు బానిసైన భర్తను మద్యం మానెయ్యమని భార్య కొరగా అందుకు భర్త వినకపోవడంతో విసుగు చెందిన భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటనా హైదరాబాద్ లో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. మురాద్ నగర్ సయ్యద్ అలీ గూడలో నివసించే రసూల్, అర్షియా బేగం దంపతులకు ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఇంతకు ముందే రసూల్ కు పెండ్లి అయిన విషయాన్నిదాచి అర్షియాను వివాహం చేసుకున్నాడు.

పెళ్లి అయిన రోజు నుంచి రోజు మద్యం తాగి వచ్చే వాడు దీంతో ప్రతి రోజు వారి మధ్య గోడవలు జరిగేవి. భర్తకు ఎంత చెప్పినా మద్యం మానేయకపోవడంతో భర్త ముందే ఆత్మహత్య చేసుకుంది. భార్య ఉరివేసుకుంటుండగా మద్యం మత్తులో ఉన్న రసూల్ సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. స్థానికుల సమాచారం తో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News