Thursday, January 23, 2025

వివాహిత మిస్సింగ్…

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఆఫీస్‌కు వెళ్లిన వివాహిత తిరిగి ఇంటికి రాకపోవడంతో ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం….ఫిలింనగర్ బాలారెడ్డినగర్‌లో కృష్ణవేణి, భర్త ప్రవీణ్‌కుమార్, మూడేళ్ల కుమారుడితో కలిసి ఉంటోంది. విప్రో సర్కిల్‌లోని ఓ బ్యాంక్‌లో పని చేస్తోంది. ఈ నెల 1వ తేదీన విధుల కోసం ఇంటి నుంచి బయలు దేరింది. తర్వాత భర్త ప్రవీణ్‌కుమార్‌కు ఫోన్ చేసి తాను ఉద్యోగం మానేశానని, ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. వెంటనే ప్రవీణ్ ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో ప్రవీణ్‌కుమార్ తన భార్య కన్పించడంలేదని ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. యువతి కోసం గాలింపు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News