Wednesday, January 22, 2025

ఏప్రిల్ 20 న ఆకాశంలో అద్భుతం… సరళ రేఖ పైకి 4 గ్రహాలు

- Advertisement -
- Advertisement -

Mars Venus Jupiter and Saturn Set to Align in Sky Soon

చికాగో : ఈనెల లోనే అరుదైన ఖగోళ ఘట్టాలను వీక్షించే అవకాశం కలుగుతుంది. సౌరవ్యవస్థ లోని నాలుగు గ్రహాలు ఒకే సరళరేఖ పైకి రాబోతున్నాయి. శని, అంగారక, శుక్ర, బృహస్పతి, గ్రహాలను ఉత్తరార్ధగోళం నుంచి చూడవచ్చు. ఏప్రిల్ 17 నుంచి పైన పేర్కొన్న గ్రహాలు దాదాపు ఒకే రేఖ పైకి వచ్చినట్టు కనిపిస్తాయి. అయితే ఏప్రిల్ 20న ఉదయం సూర్యోదయానికి ముందు మరింత స్పష్టంగా కనువిందు చేస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గ్రహాలను చూసేందుకు అనువైన పరిస్థితులు ఉండాలంటున్నారు. శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే రేఖపైకి రావడం మార్చి చివరి నుంచే మొదలైంది. అయితే ఏప్రిల్ తర్వాత బృహస్పతి కూడా ఈ రేఖపైకి వస్తుంది. ఈ విధంగా 4 గ్రహాలు ఒకే రేఖపైకి రావడం చాలా అరుదైన విషయంగా చెబుతున్నారు. మరోవైపు ఏప్రిల్ 23న ఈ నాలుగు గ్రహాల సరసన చంద్రుడు కూడా చేరబోతున్నాడు. సరళ రేఖ కుడిపక్కన చందమామ కనిపిస్తుంది. అయితే అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ప్రత్యేకంగా కనిపిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News