- Advertisement -
జమ్మూ కాశ్మీర్ శాసనసభలో శుక్రవారం రభస చెలరేగింది. ప్రత్యేక హోదా తీర్మానంపై బిజెపి సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనితో 12 మంది ప్రతిపక్ష ఎంఎల్‌ఎలను. లాంగాటె శాసనసభ్యుడు షేఖ్ ఖుర్షీద్‌ను మార్షల్స్ సాయంతో స్పీకర్ పంపివేశారు. సభ ఉదయం సమావేశమైనప్పుడు బిజెపి ఎంఎల్‌ఎలు ‘పాకిస్తానీ అజెండా నహీ చలేగా’ (పాకిస్తానీ అజెండా సాగబోదు) వంటి నినాదాలు చేశారు.
బిజెపి ఎంఎల్‌ఎలు సభ మధ్యంలోకి దూసుకుపోగా వారిని పంపివేయవలసిందిగా మార్షల్స్‌ను స్పీకర్ అబ్దుర్ రహీమ్ రాథర్ ఆదేశించారు. వారిని బయటకు గెంటివేసిన మరుక్షణమే 11 మంది ఇతర బిజెపి ఎంఎల్‌ఎలు అందుకు నిరసనగా సభలో నుంచి వాకౌట్ చేశారు. ప్రత్యేక హోదా పునరుద్ధరణ తీర్మానం ఆమోదం పొందిన తరువాత బిజెపి ఎంఎల్‌ఎలు ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేస్తుండడంతో గత రెండు రోజులుగా సభలో గందరగోళ దృశ్యాలు కానవస్తున్నాయి.
- Advertisement -