Thursday, January 23, 2025

ఆత్మరక్షణ కోసం యుద్ధ క్రీడలు దోహదం

- Advertisement -
- Advertisement -

గద్వాలటౌన్: ఆత్మరక్షణతో పాటు, మానసిక, శారీరక ధృడకత్వం కోసం కరాటే వంటి యుద్దక్రీడలు ఎంతో దోహదపడుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన 38వ జాతీయ స్థాయి సీనియర్ కరాటే పోటీల్లో ధరూర్ మండలం కేంద్రానికి చెంది న కురువ వినోద, ఓబులోనిపల్లి గ్రామానికి చెందిన గాయిత్రి గోల్డ్ మెడల్ సాధించారు.

ఈ సందర్భంగా గోల్డ్‌మెడల్ సాధించిన క్రీడాకారులను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదార్థి దశలోనే యుద్ధ్దవిద్యలపై ఆసక్తికనబరచాలన్నారు. కరాటే నేర్చుకోవడం వల్ల శారీరక మానసిక ధృడత్వం సిద్ధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ధరూర్ వైస్ ఎంపిపి సుదర్శన్ రెడ్డి, జెడ్పీటిసి రాజశేఖర్, కౌన్సిలర్‌లు నాగిరెడ్డి, శ్రీనివాస్, ధరూర్ మండల బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News