సొంత ప్రయోగాలతో పలు ప్రయోగాలు
మనతెలంగాణ/కాసిపేట: స్వయంగా మార్ష్‌ల్ ఆర్ట్స్ లో ప్రవీణ్యం సంపాదించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే కళలలో సాహస పూరితమైన సాహసాలు చేస్తు పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి కి చెందిన రమేష్‌రాజా సాహసమే నా ఊపిరి అంటు పలు విన్యాసాలు చేస్తూ పలువురి మన్ననలు పొందుచున్నారు. మార్షల్ ఆర్ట్‌లు నాన్‌చాక్, కర్ర తిప్పడం, కత్తి సాము జంపింగ్ చేస్తు సాహోసపేతమైన ప్రయోగాలు ప్రదర్శిస్తు పలు ప్రశంశ పత్రాలు, బహుమతులు, మన్ననలు పొందుచున్నారు. కాళ్లపై నుండి ట్రాక్టర్లను పొనిచ్చుకోవడం, చేతులపై రోడ్డు రోలర్లు, ట్రాక్టర్లు పోనిచ్చుకోవడం, మెట్లపై చేతులతో ఎక్కడం, పోల్స్‌పై సర్కాస్ ఫీట్లు చేస్తు ప్రజల నుండి అభినందలను పొందుచున్నారు. రమేష్‌రాజా సాహోసపేతమైన సాహస ఫిట్స్ చేస్తున్నప్పటికి సరైన ఆదరణ లేని కారణంగా తనలో ఉన్న టాలెంట్ బయటకు రాలేక పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు స్నేహితులు ఇచ్చే చిన్న ప్రొత్సహంతో పలు ఫీట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన సాహోసపేతమైన ఫీట్లు పలు ప్రదర్శనలు చేయడం జరిగిందన్నారు. ఎవరైన ఆదరిస్తే మరిన్ని సాహోసపేతమైన ఫీట్లు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు రమేష్‌రాజా తెలిపారు.