న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్, టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో గప్టిల్ ఈ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్ లో గప్టిల్ కేవలం 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌ల సహాయంతో 97 పరుగులు చేశాడు. ఈ 8 సిక్సర్లతో గప్టిల్ టీ20ల్లో ప్రపంచంలోనే అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. గప్టిల్ మొత్తం 96 టీ20లో 132 సిక్స్‌లు బాదాడు. ఇక రోహిత్ శర్మ 108 టీ20లో 127 సిక్స్‌లతో రెండోస్థానానికి పడిపోయాడు. వీరి తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 97టీ20లో 113 సిక్స్‌లు, న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ కొలిన్ మన్రో 107 సిక్స్ లు, క్రిస్ గేల్ 58 టీ20లోనే 105 సిక్స్ లతో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
Martin Guptill breaks Rohit Records in ICC T20 Matches