Wednesday, January 22, 2025

పాన్ ఇండియా మూవీ ‘మార్టిన్’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో భారీ పాన్ ఇండియా మూవీ వస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టు ‘మార్టిన్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

కళ్లు చెదిరే యాక్షన్ సీన్లతో టీజర్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు కన్నడ స్టార్ డైరెక్టర్ ఎపి అర్జున్ దర్శకత్వం వహించగా.. అర్జున్ కథను అందించారు.ఇక, ధృవ సర్జాకు జోడీగా వైష్ణవి శాండిల్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఉదయ్ కె. మెహతా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందించగా, రవి బస్రూర్ నేపథ్య సంగీతం అందించారు. కాగా, ధృవ సర్జా ‘పొగరు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News