Monday, December 23, 2024

కోటగిరిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం

- Advertisement -
- Advertisement -

కోటగిరి: రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలలో భాగంగా కోటగిరి ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపిపి వల్లేపల్లి సునీత శ్రీనివాసరావు అధ్యక్షతన అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన అమరవీరుల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు.

అనంతరం ఎంపిడిఓ కెఆర్ మనోహర్‌రెడ్డి అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సమావేశంలో ఎంపిపి వల్లేపల్లి సునీత శ్రీనివాస్‌రావు, వైస్ ఎంపిపి గంగాధర్ పటేల్, ఎంపిడిఓ కెఆర్ మనోహర్‌రెడ్డి, ఇన్‌ఛార్జి తహసీల్దార్ ఆజీజ్, ఎంపిటీసీలు అనంత్ విఠల్, ఫారూఖ్, సాయిలు, పుప్పాల సరిత, సర్పంచులు పత్తి లక్ష్మణ్, సాయిబాబా, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News