Wednesday, January 22, 2025

నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

వికారాబాద్ : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 22న గురువారం అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి అమరుల సంస్మరణ కార్యక్రమ ఏర్పాట్లపై చేపట్టాల్సిన పనులపై అధికారులకు సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 20 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, నేడు నిర్వహించనున్న అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విజయవంతంగా నిర్వహించెందుకు ప్రజలు, ప్ర జా ప్రతినిధులు, అధికారులు, ఉద్యమకారులు అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. గు రువారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృ హం వద్ద కొత్తగా నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని మంత్రి సబి తా ఇంద్రారెడ్డి ఉదయం 9:00 గంటలకు ప్రారంభించనున్నారని, స్థూపానికి నిండుగా పూలతో అందంగా అలంకరించి, పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలన్నారు.

కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొనాలని ఆదేశించారు. గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అమరుల సంస్మరణ కా ర్యక్రమం నిర్వహించి వారికి శ్రద్ధాంజలి ఘటించాలన్నా రు. అనంతరం వికారాబాద్ శాసనసభ్యులు మెతుకు ఆనం ద్, స్థానిక కౌన్సిలర్లు, అధికారులతో కలిసి అమరవీరుల స్తూపం నిర్మాణపు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ అ మరవీరులను గుర్తు చేసుకునేందుకు వీలుగా స్థూపాన్ని ఏ ర్పాటు చేయడం జరుగుతుందని, ఈరోజు మంత్రి చేతుల మీదుగా అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించుకో బోటున్నమ్మన్నారు. ఈ కార్యక్రమంలో తొలితరం, మలితరం ఉద్యమకారులు, ప్రజలు అంద రూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశం లో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్, ఆర్డీవో విజయకుమారి, జిల్లా అధికారు లు, ఆర్ అండ్ బి డిఈ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News