- ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పరిగి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చివరి రోజు గురువారం అమర వీరుల సంస్కరణ దినోత్సవాన్ని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్‌లోని కొడంగల్ చౌరస్తా వద్ద ఉన్న అమరవీరుల స్థూప చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ త్వరలో పరిగిలో అమర వీరుల స్థూపాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అమరులైన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు స్మరించుకుటందని గుర్తు చేశారు. వారి కుటుంబాలకు కేసిఆర్ అండగా నిలిచారని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ అనేక సంక్షేమ ఫలాలను తీసుకవచ్చి పేదలకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు.
అనంతరం ఎండిఓ కార్యాలయంలో అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ తరుణ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, బిఆర్‌ఎస్ నాయకులు కొప్పుల అనీల్‌రెడ్డి, ఎంపిపి కరణం అరవింద్‌రావు, జడ్‌పిటిసి హారిప్రియాప్రవీణ్‌రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ సురేందర్, సొసైటీ వైస్ చైర్మన్ భాస్కర్, ఎంపిడిఓ శేషగిరిశర్మ, కల్లు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్‌లు కిరణ్‌కుమార్, వారాల రవీందర్, ఎదిరే కృష్ణ, వెంకటేష్, నాగేశ్వర్, మున్నీర్, రవి, మౌలానా, తహేర్‌ఆలీ, పీరంపల్లి రాజు, మొగులయ్య, ఆసీఫ్, నితీన్, రఘువీర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.