Sunday, February 23, 2025

పక్కా మాసీగా

- Advertisement -
- Advertisement -

రావు రమేష్ కథానాయకుడిగా, టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ’మారుతి నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రధారులు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా వినూత్నంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ’మారుతి నగర్ సుబ్రమణ్యం’లో రావు రమేష్ ఫస్ట్ లుక్ చూస్తే… గళ్ళ చొక్కా, లుంగీలో పక్కా మాసీగా కనిపిస్తున్నారు. ఈసారి ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తానని ఈ సందర్భంగా రావు రమేష్ తెలిపారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఇప్పటి వరకు రావు రమేష్ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News