Thursday, January 23, 2025

20న మారుతీ గ్రాండ్ విటారా లాంచ్

- Advertisement -
- Advertisement -

Maruti Grand Vitara launch on 20th

 

న్యూఢిల్లీ : మారుతి సుజుకి సరికొత్త ప్రీమియం ఎస్‌యువి గ్రాండ్ విటారా బుకింగ్ ప్రారంభించింది. కొత్త ఎస్‌యువి లాంచ్ జూలై 20న జరగనుంది. విటారాను నెక్సా షోరూమ్ లేదా వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ఖాతాగా రూ. 11,000 ప్రారంభ చెల్లింపు ఉంటుంది. కొత్త గ్రాండ్ విటారా గత నెలలో విడుదల చేసిన టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌కు పోటీ ఇవ్వనుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌తో కూడా పోటీపడుతుంది. గత నెలలో మారుతి సుజుకి సరికొత్త ఎస్‌యువి బ్రెజాను పరిచయం చేయగా, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7,99,000 నుండి ప్రారంభమవుతుంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హిసాషి టేకుచి మాట్లాడుతూ, మారుతి సుజుకి అన్ని విభాగాలలో తన స్థానాన్ని పటిష్టం చేస్తుందని, ఇది ఎస్‌యువి సెగ్మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెడుతుందని అన్నారు. ఎస్‌యువి సెగ్మెంట్‌లో 50 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకోవడానికి మారుతి సుజుకి 18 నుండి 24 నెలల్లో 4 ఎస్‌యువిలను విడుదల చేయాలని ప్రణాళిక ఉందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News