Monday, December 23, 2024

మారుతీ సుజుకీ కార్లు ప్రియం

- Advertisement -
- Advertisement -

అన్ని మోడళ్ల ధరలు 0.45 శాతం పెంపు

ముంబై : దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. కంపెనీ తన అన్ని మోడళ్ల ధరలను పెంచింది. ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. అన్ని మోడళ్ల సగటు ధర 0.45% పెరిగినట్లు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అంతకుముందు మారుతీ సుజుకీ గత ఏడాది ఏప్రిల్ 1న తన అన్ని వాహనాల ధరలను పెంచింది.

కంపెనీ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో నుండి మల్టీ- యుటిలిటీ వెహికల్ ఇన్విక్టో వరకు అనేక రకాల మోడళ్లను విక్రయిస్తోంది. ఈ వాహనాల ధర రూ.3.54 లక్షల నుండి మొదలై రూ.28.52 లక్షల వరకు ఉంటుంది. దీంతో పాటు థార్, స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్, ఎక్స్‌యువి700 ధరలను కూడా మహీంద్రా పెంచింది. అయితే మహీంద్రా ఎక్స్‌యువి 700 కొన్ని వేరియంట్‌ల ధరలను తగ్గించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News