Monday, December 30, 2024

జిమ్నీపై మారుతి భారీ ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారీ అంచనాల మధ్య జిమ్నీ కారు మార్కెట్లోకి తెచ్చింది. కానీ కస్టమర్లను ఆకర్షించడంలో వెనుకబడ్డ జిమ్నీ విక్రయాలు పడిపోతున్నాయి. గత జూన్‌లో మార్కెట్లోకి తెచ్చిన మారుతి జిమ్నీ ఇప్పటి వరకూ 15,476 యూనిట్లు మాత్రమే విక్రయించింది. జూన్‌లో 3071, జూలైలో 3778, ఆగస్టులో 3104, సెప్టెంబర్ లో 2651, అక్టోబర్ లో 1852, గత నెలలో 1020 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఆఫ్ రోడ్ మోడల్ కారు జిమ్నీలో మెరుగైన ఫీచర్లే ఉన్నా.. ధర ఎక్కువ కావడంతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారు. ధర తగ్గించాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ పరిస్థితుల్లో కస్టమర్లను ఆకర్షించడానికి జిమ్నీపై మారుతి సుజుకి ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. మారుతి జిమ్నీ జెటా వేరియంట్ మీద రూ.2.21 లక్షల డిస్కౌంట్, ఆల్ఫా వేరియంట్ మీద రూ.1.21 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేసింది.

మారుతి సుజుకి జిమ్నీ కారు రెండు వేరియంట్లు – జెటా, ఆల్ఫా వేరియంట్లలో లభ్యం అవుతోంది. జెటా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్ కారు ధర రూ.12.74 లక్షలు (ఎక్స్ షోరూమ్), ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ధర రూ.13.94 లక్షలు, ఆల్ఫా వేరియంట్ రూ.13.69 లక్షలు – రూ.15.06 లక్షల మధ్య పలుకుతున్నది. ఇక జిమ్నీ లిమిటెడ్ ఎడిషన్ ‘థండర్ ఎడిషన్’ మాత్రం రూ.10.74 లక్షలకే అందిస్తోంది మారుతి సుజుకి. మహీంద్రా అండ్ మహీంద్రా థార్ కారు ధర రూ.10.98 లక్షల (ఎక్స్ షోరూమ్)కే లభిస్తుండటంతో వినియోగదారులు జిమ్నీ పట్ల ఆసక్తి చూపడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News