Saturday, December 21, 2024

మారుతీ సుజుకీ సేల్స్ 26 శాతం జంప్

- Advertisement -
- Advertisement -

Maruti Suzuki sales increase 26 percent

ముంబై : కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆగస్టులో మొత్తం విక్రయాలు 1,65,173 యూనిట్లు నమోదు చేసింది. గతేడాదిలో సేల్స్ 1,30, 699 యూనిట్లతో పోలిస్తే 26.37% వృద్ధిని నమోదు చేసింది. ఈమేరకు మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్(ఎంఎస్‌ఐఎల్) గణాంకాలను విడుదల చేసింది. దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 1,03,187 యూనిట్ల నుంచి 1,34,166 యూనిట్లకు పెరిగాయి. అంటే 30 శాతం వృద్ధి నమోదైంది. మినీ సెగ్మెంట్‌లో ఎస్ క్రాస్ సేల్స్ 20,461 యూనిట్ల నుంచి 22,162 యూనిట్లకు పెరిగాయి. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వాగనర్ సహా కాంపాక్ట్ కార్ల విక్రయాల విక్రయాలు 71,557 యూనిట్లతో 57% వృద్ధిని సాధించాయి. గతేడాది ఈ విక్రయాలు 45,577 యూనిట్ల మాత్రమే నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News