- Advertisement -
న్యూఢిల్లీ : దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ దేశీయంగా హాచ్బ్యాక్ స్విఫ్ట్ సేల్స్‌లో 25 లక్షల మైలురాయిని సాధించింది. దేశంలో ఈ కారు 9 ట్రిమ్ లెవెల్స్‌లో లభ్యమవుతుంది. ధర ప్రారంభం రూ.5.85 లక్షలు (ఎక్స్ షోరూం), టాప్ రన్ వేరియంట్ ధర రూ.8.67 (ఎక్స్ షోరూం) వరకు ఉంది. మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, 2005లో స్విఫ్ట్ కారును దేశంలో లాంచ్ చేశామని, దేశంలో ఎక్కువ ప్రశంసలు పొందిన ప్రీమియం హాచ్బ్యాక్ కారు ఇదని అన్నారు. ప్రతిష్టాత్మక ఐసిఒటివై అవార్డును పొందిన ఏకైక మోడల్ మారుతీ సుజుకీ స్విఫ్ట్ అని తెలిపారు.
- Advertisement -