ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మారుతి స్విఫ్ట్ ను ఈ ఏడాది మేలో భారత్ మార్కెట్లో విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు మారుతి షిఫ్ట్ కారు CNG వేరియంట్ ను తీసుకురావాలని అనుకుంటుంది. కంపెనీ మారుతి షిఫ్ట్ CNG ఎప్పుడు లాంచ్ చేయనుంది? పెట్రోల్ తో పోలిస్తే దీని ధర ఎంత? దీని ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి అనే వివిధ అంశాల మీద ఈ ఆర్టికల్ ద్వారా పూర్తిగా తెలుసుకుందాం.
కొన్ని నివేదికల ప్రకారం..కంపెనీ మారుతి స్విఫ్ట్ CNGలో కొత్త Z సిరీస్ ఇంజిన్‌ను మాత్రమే అందిస్తుంది. ఈ మూడు సిలిండర్ల ఇంజన్ సామర్థ్యం 1.2 లీటర్లు. ఈ ఇంజన్ CNG మోడ్‌లో 69 PS పవర్, 97 న్యూటన్ మీటర్ల టార్క్ అందించగలదు. అలాగే కొత్త తరం స్విఫ్ట్‌లో మారుతి అందించిన ఫీచర్లు. అదే ఫీచర్లు CNG వేరియంట్లలో కూడా అందించనున్నారు. ABS, EBDతో పాటు.. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా..వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 17.78 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఏసీ వంటి ఫీచర్లను ఇందులో అందించనున్నారు.
లాంచ్ విషయానికి వస్తే..స్విఫ్ట్ CNG లాంచ్‌కు సంబంధించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ మీడియా నివేదికల ప్రకారం..ఇది సెప్టెంబర్ 12 (మారుతి స్విఫ్ట్ CNG లాంచ్ తేదీ) న మార్కెట్లోకి రానున్నది. ఇక మారుతి స్విఫ్ట్ CNG ధర గురుంచి మాట్లాడుకుంటే..స్విఫ్ట్ సిఎన్‌జిని మారుతి ఒకటి కంటే ఎక్కువ వేరియంట్‌లలో తీసుకురావచ్చు. ఈ క్రమంలో దాని సాధ్యమైన ధర పెట్రోల్ వేరియంట్ కంటే 70 నుండి 90 వేల రూపాయలు ఎక్కువగా ఉండవచ్చు. కొత్త తరం స్విఫ్ట్‌ను మారుతి రూ. 6.49 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందిస్తోంది.