Monday, January 20, 2025

రెజ్లింగ్ సమాఖ్య వివాదం.. మేరీకోమ్ నేతృత్వంలో విచారణ కమిటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన రెజ్లింగ్ సమాఖ్య వివాదంపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సోమవారం కమిటీని ఏర్పాటు చేసింది. భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడని రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో రెజ్లింగ్ సమాఖ్య కార్యవర్గాన్ని వెంటనే రద్దు చేయాలని, అధ్యక్షుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా, సాక్షి మలిక్ తదితరులు మూడు రోజుల పాటు ధర్నా చేయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కాగా, కేంద్ర క్రీడల మంత్రి జోక్యం చేసుకుని ఈ ఆందోళనను విరమింప చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ చేపడుతామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే మేరీకోమ్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. మేరీకోమ్‌తో పాటు యోగేశ్వర్ దత్, సహదేవ్ యాదవ్, అలక్‌నంద అశోక్, డోలా బెనర్జీ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News