Thursday, January 23, 2025

దేశ ప్రజలను ఏకం చేసిన ‘మేరీ మాటీ మేరా దేశ్’ : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రజల్లో దేశ భక్తి భావనను జాగృతం చేయడంతో పాటు.. అందరినీ ఏక తాటిపైకి తీసుకొచ్చేందుకే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని రెండేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం దేశ రాజధానిలో ‘మేరీ మాటీ మేరా దేశ్’ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైన మేరా మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో 6 లక్షల గ్రామాలు, కోట్ల ఇండ్లనుంచి అమృత కలశాల్లో, మట్టి, బియ్యాన్ని పంపించడంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో.. పలు ప్రపంచ రికార్డులు నమోదవడం.. వివిధ అంశాలను కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, బిజెపితో సహా వివిధ పార్టీల ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు, దేశ నలుమూలలనుంచి ఆయా ప్రాంతాల నుంచి అమృత కలశాల్లో మట్టిని ఢిల్లీకి తీసుకొచ్చిన 75వేల మంది యువకులు కూడా పాల్గొన్నారు.

Mera-Mati..-Mera-Desh

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News