Thursday, December 26, 2024

గోల్డెన్ బాయ్ నదీమ్‌కు జాక్‌పాట్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన పాకిస్థాన్ యువ సంచలనం, జావెలియన్ త్రో హీరో అర్షద్ నదీమ్‌పై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. జావెలిన్ త్రోలో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రాను వెనక్కినెట్టి నదీమ్ పసిడి పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఒలింపిక్స్ చరిత్రలోనే వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా నదీమ్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. పసిడి పతకం సాధించి పాకిస్థాన్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన నదీమ్‌పై పాకిస్థాన్‌తో పాటు విదేశాల నుంచి కాసుల వర్షం కురుస్తోంది.

తాజాగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్సు ముఖ్యమంత్రి మరియం నవాజ్ గోల్డెన్ బాయ్ నదీమ్‌కు జాక్‌పాట్ ప్రకటించారు. మరియం స్వయంగా నదీమ్ స్వగ్రామం మియాన్ చన్నూను సందర్శించారు. ఈ సందర్భంగా నదీమ్‌ను ఘనంగా సత్కరించారు. అంతేగాక నదీమ్‌కు రూ.10 కోట్ల రివార్డుతో పాటు హోండా సివిక్ కారును బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News