Monday, December 23, 2024

పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ మొదటి మహిళా సిఎంగా మర్యం నవాజ్

- Advertisement -
- Advertisement -

లాహోర్ : నవాజ్ షరీఫ్ కుమార్తె మర్యం నవాజ్ పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ మొదటి మహిళా సిఎంగా శుక్రవారం పదవిని చేపట్టనున్నారు. ఫిబ్రవరి 8న పాక్ లోని మొత్తం ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరగ్గా, పంజాబ్ అసెంబ్లీయే మొట్టమొదటగా శుక్రవారం సమావేశం కానున్నది. పంజాబ్ గవర్నర్ బాలిగౌర్ రెహమాన్ శుక్రవారం అసెంబ్లీ సమావేశానికి పిలుపు నిచ్చారని, కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారని , కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని గవర్నర్ హౌస్ అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు.

50 ఏళ్ల మర్యం పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్‌ఎన్) పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. 120 మిలియన్ ప్రజలున్న పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా మర్యంను పార్టీ ప్రతిపాదించింది. పంజాబ్ అసెంబ్లీలో 137 స్థానాలను పిఎంఎల్‌ఎన్ గెల్చుకోగా, ఇమ్రాన్‌ఖాన్ బలపర్చిన ఇండిపెండెంట్లు 113 సీట్లను సాధించారు. ప్రత్యేకంగా తటస్థ ఇండిపెండెంట్లు 20 మంది ఉన్నారు. వీరు పిఎంఎల్‌ఎన్‌లో ఈపాటికే చేరిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News