మేరీల్యాండ్(అమెరికా): మేరీల్యాండ్‌లోని సూపర్ మార్కెట్లో ముగ్గురిపై కాల్పులు జరిపిన అనుమానితుడు తన తల్లిదండ్రులను కూడా కాల్చివేసి తన అపార్ట్‌మెంట్‌కు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు బాల్టిమోర్ కౌంటీ పోలీసులు ఆదివారం వెల్లడించారు. రాయల్ ఫార్మ్ స్టోర్‌లో జరిగిన కాల్పులలో ఇద్దరు మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కాల్పులలో పాల్పడింది బాల్డిన్ ప్రాంతానికి చెందిన జోషువ గ్రీన్(27)గా పోలీసులు గుర్తించారు. స్టోర్ నుంచి బయల్దేరిన గ్రీన్ తన అపార్ట్‌మెంట్‌కు చేరుకుని తన ఇంటికి నిప్పంటించి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. అతని తల్లిదంద్రుల మృతదేహాలు ఇంట్లో లభించాయని, వారిద్దరిపై తుపాకీ తూటాల గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. అయితే వారిద్దరూ ఎప్పుడు మరణించి ఉంటారో తెలియరాలేదని వారు తెలిపారు.