Friday, September 20, 2024

న్యూట్రినో పరిశోధకుడు మసతోషీ కోషిబా మృతి

- Advertisement -
- Advertisement -

Masatoshi Koshiba who found neutrinos died

టోక్యో: జపాన్ ఖగోళభౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత మసతోషీ కోషిబా(94) మరణించారని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం టోక్యోలోని హాస్పిటల్‌లో ఆయన మరణించారని తెలిపింది. విశ్వ నిర్మాణంలోని ప్రాథమిక కణాల్లో ఒకటైన న్యూట్రినోను నిర్ధారించడంలో కోషిబా కీలక పాత్ర వహించినందుకు మరో ఇద్దరితో కలిపి భౌతికశాస్త్రంలో 2002లో నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు. విశ్వంలోని అత్యంత సూక్ష్మకణాల్లో(విడదీయ వీలుకాని కణాల్లో) న్యూట్రినో ఒకటి. గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, మానవులుసహా అన్ని జీవులు..ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వంలోని ప్రతి ఒక్కటీ ప్రాథమిక కణాల మిశ్రమాలే. న్యూట్రినోలకు ద్రవ్యరాశి ఉంటుందని నిర్ధారించినందుకు కోషిబా శిష్యుడు టకాకీ కాజితాకు 2015లో మరో నోబెల్ బహుమతి లభించింది.

Masatoshi Koshiba who found neutrinos died

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News