- Advertisement -
మాస్కో: తన జైలుశిక్షను రద్దు చేయాలని రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(44) వేసిన పిటిషన్ను మాస్కో సిటీ కోర్టు తిరస్కరించింది. తనపై రష్యా ప్రభుత్వం విషప్రయోగానికి పాల్పడిందంటూ నావల్నీ జర్మనీలో ఆశ్రయం పొందడంపై కేసు నమోదైంది. దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన వ్యవహరించారని ఆరోపణలున్నాయి. ఇటీవలే నావల్నీకి రెండేళ్ల 8 నెలల శిక్ష విధిస్తూ కిందికోర్టు తీర్పు వెల్లడించింది. దానిని మాస్కో కోర్టులో సవాల్ చేయగా, కేవలం ఒకటిన్నర నెల శిక్షను తగ్గించింది. 2015లో నావల్నీ ఆమేరకు గృహ నిర్బంధంలో ఉన్నందున శిక్ష తగ్గించినట్టు కోర్టు పేర్కొన్నది. ఆయన్ని విడుదల చేయాలంటూ యూరోపియన్ మానవ హక్కుల కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను రష్యా తప్పు పట్టింది. తమ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ హితవు పలికింది.
- Advertisement -