Monday, December 23, 2024

మాస్క్ మస్ట్

- Advertisement -
- Advertisement -

Mask is mandatory for air travelers:DGCA

కొవిడ్ ఉధ్ధృతి వేళ డిజీసీఏ ఆదేశాలు

న్యూఢిల్లీ : కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ ( డీజీసీఎ ) ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్టు, విమానాల్లో ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేసింది. ప్రయాణ సమయమంతా మాస్క్ ధరించి ఉండాల్సిందేనని. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వారు మాస్క్ తీసేందుకు అనుమతివ్వాలని ఆదేశించింది. ఒకవేళ కొవిడ్ నిబంధనలు పాటించేందుకు ప్రయాణికులు నిరాకరిస్తే వారిని విమానం బయల్దేరడానికి ముందే దింపేయాలి. ప్రయాణ సమయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రయాణికులు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని నో ఫ్లై జాబితాలో చేర్చాలి. మాస్క్ లేకుంటే ఎయిర్‌పోర్టు లోకి అనుమతించకూడదు అని డిజిసిఎ విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు మార్గదర్శకాలు జారీ చేసింది. మాస్క్ ధరించని వారిపై స్థానిక పోలీసులు భద్రతా ఏజెన్సీల సహకారంతో విమానాశ్రయం అధికారులు జరిమానా విధించాలి. తప్పనిసరైన సందర్భాల్లో మాత్రమే మాస్క్‌ను తీసేందుకు ప్రయాణికులకు అనుమతించాలి.

ప్రయాణికుల్లో ఎవరైనా అదనంగా మాస్క్ అడిగితే సంబంధిత ఎయిర్‌లైన్స్ సిబ్బంది సమకూర్చాలి. విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ల సంఖ్యను పెంచాలి. ఎయిర్‌పోర్టుల్లో హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. అని మార్గదర్శకాల్లో డీజీసీఏ సూచించింది. కొవిడ్ భద్రతా చర్యలను పాటించేందుకు నిరాకరించే విమాన ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం ముగియలేదని , నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలకు కోర్టు ఆదేశించింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై ఆరోగ్య మంత్రిత్వశాఖ లేదా డిజిసిఎ మార్గదర్శకాల ప్రకారం చర్య తీసుకోవాలని ఆదేశించిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News