జైపూర్: సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఒక యువకుడు వేసిన చివరకు అతడిని కటకటాల్లోకి నెట్టేసింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కారుపై నిలబడి రూ. 20 కరెన్సీ నోట్లను విసిరేసి న్యూసెన్సుకు పల్పాడిన ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
నగరంలోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో నివసించే అజయ్ శర్మ అనే యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఈ పని చేశాడని డిసిపి(తూర్పు) జ్ఞాన్ చంద్ర యాదవ్ తెలిపారు. మనీ హీస్ట్ వెబ్ సిరీస్‌లోని సన్నివేశాలను నిజజీవితంలో చూపించేందుకు అజయ్ శర్మ ఈ పని చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఆయన చెప్పారు. అయితే నిందితుడు విసిరేసిన నోట్లన్నీ నకిలీవేనని ఆయన వెల్లడించారు.అక్టోబర్ 1వ తేదీన శర్మ నగరంలోని సిటీ పల్స్, గౌరవ్ టవర్ మాల్స్‌ను సందర్శించాడని ఆయన చెప్పారు.
అజయ్ శర్మ నోట్లు విసురుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మంగళవారం అతడిని పిలిపించి అరెస్టు చేశారు. శాంతిని భగ్నం చేయడం, మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించడం అభియోగాలపై శర్మను పోలీసులు అరెస్టు చేశారు.
ऐसा लगता है कि Money Heist का कोई सा charactor राजधानी जयपुर में आ गया है #Jaipur #Rajasthan #India #MoneyHeist2 #MoneyHeist pic.twitter.com/8XWTZVvPkO
— राजस्थानी गलियारा (@rajgaliyara) October 3, 2023