Friday, November 15, 2024

24 మృతదేహాలకు సామూహిక దహనం

- Advertisement -
- Advertisement -

బుల్ధానా ( మహారాష్ట్ర): మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ప్రైవేట్ బస్సుకు అగ్ని ప్రమాదం సంభవించి 25 మంది సజీవ దహనం అయిన సంఘటన తెలిసిందే అయితే ఈ 25 మృతదేహాల్లో 24 మృతదేహాలకు ఆదివారం బుల్ధానాలోని వైకుంఠ్ ధామ్ హిందూ స్మశాన భూమిలో సామూహిక దహనం జరిపించారు. ఒక మృతదేహాన్ని సమాధి కోసం కుటుంబీకులకు అప్పగించడమౌతుందని అధికారులు తెలిపారు. మృతదేహాలకు డిఎన్‌ఎ పరీక్ష నిర్వహించడం సుదీర్ఘ ప్రక్రియ అవుతుందని, వ్యక్తులను గుర్తించడానికి కొన్ని రోజులు పడుతుందని అందుకని మృతుల కుటుంబాలను ఒప్పించి సామూహిక దహనం చేయడమైందని అధికారులు తెలిపారు. మృతుల సంబంధీకులు, మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ ఈ సామూహిక దహనం సందర్భంగా పాల్గొన్నారు.

మృతుల్లో 11 మంది పురుషులు కాగా, 14 మంది మహిళలు. వీరిలో పది మంది వార్ధాకు , ఏడుగురు పుణెకు, నలుగురు నాగ్‌పూర్‌కు చెందిన వారు. మరో ఇద్దరిలో ఒకరు యావత్మాల్, ఇంకొకరు వాసీమ్‌కు చెందిన వారు. ప్రమాదం నుంచి బయటపడిన ఎనిమిది మందిలో డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. నిర్లక్షంగా బస్సు నడిపినందుకు డ్రైవర్‌పై కేసు నమోదైంది. మత్తులో ఉండడంతో వాహనం అదుపు తప్పినట్టు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News