Sunday, December 22, 2024

స్టైలిష్ డ్రెస్సింగ్‌లో రవితేజ మాస్ లుక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ థియేట్రికల్ రాకకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా మేకర్స్ ఈగల్ సినిమా నుంచి రవితేజ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. 50 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌లో రవితేజ డెస్క్‌పై చాలా ఆయుధాలతో కనిపించారు. స్టైలిష్ డ్రెస్సింగ్‌లో చాలా ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

టీజర్ అద్భుతమైన స్పందనతో సినిమాపై ఆసక్తిని పెంచింది. కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో మేకర్స్ మరింత దూకుడు పెంచారు. సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ మరో కథానాయికగా నటించింది. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం. కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News