Wednesday, January 22, 2025

పోషకాహార లోపాన్ని రూపుమాపడానికి ప్రజా ఉద్యమం

- Advertisement -
- Advertisement -

Mass movement to eradicate malnutrition: PM Modi

మన్‌కీబాత్‌లో ప్రధాని మోడీ సూచన

న్యూఢిల్లీ : దేశంలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రజలు కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. మన్‌కీబాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం జాతినుద్దేశించి రేడియోలో ప్రసంగించారు. భారత్ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘అమృత్ మహోత్సవ్ ’ అమృత ధారలు దేశ నలుమూలలా ప్రవహించాయని పేర్కొన్నారు. పోషకాహార లోపాన్ని రూపు మాపడంలో సామాజిక అవగాహనే కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలందరూ ఈ ఉద్యమంలో కలిసి రావాలని కోరారు.

“పండగలతోపాటు ఈసారి సెప్టెంబర్ నెలను పోషకాహారంపై ప్రచారానికి అంకితం చేద్దాం. మనం సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకు పోషణ్ మాహ్ (పోషకాహార మాసం) గా పాటిద్దాం ” అని మోడీ పిలుపునిచ్చారు. పోషకాహార నివారణకు చాలా సృజనాత్మక , విభిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నామని మోడీ పేర్కొన్నారు. “పోషణ్ అభియాన్‌లో సాంకేతిక , ప్రజాభాగస్వామ్యాన్ని మెరుగైన పద్ధతుల్లో వాడటం చాలా కీలకం. భారత్‌లో పోషకాహార లోపాన్ని రూపుమాపడంతో జల్‌జీవన్ మిషన్ భారీగా ప్రభావం చూపనుంది. ” అని ప్రధాని వివరించారు. దూరదర్శన్‌లో స్వతంత్య్ర సమర యోధుల త్యాగాలపై వచ్చే ‘స్వరాజ్ ’సీరియల్‌ను వీక్షించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న యోధుల కృషిని యువతరానికి తెలియజేయడానికి ఇదో గొప్ప ప్రయత్నమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News